బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని తెలుస్తుంది. లాస్ట్ సండేనే హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని చెప్పారు. అంతేకాదు ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉంటుందని కూడా చెప్పారు. ఇంతకీ హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరన్నది చూడాలి. ఐతే వీకెండ్ లో వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తం 8 మంది వస్తున్నారని హౌస్ మెట్స్ తో చెప్పాడు బిగ్ బాస్. – మలయాళ సినిమా.. ఇక నుంచి కండీషన్స్ అప్లై..! ఐతే ఈసారి సరికొత్తగా ఆల్రెడీ బిగ్ బాస్ ఇదివరకు సీజన్లలో ఉన్న వారినే మళ్లీ వైల్డ్ కార్డ్ గా తెస్తున్నారు. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు వచ్చిన కంటెస్టెంట్స్ లో వైల్డ్ కార్డ్ గా వస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో భాగంగా వైల్డ్ కార్డ్ గా వచ్చే 8 మంది కంటెస్టెంట్స్ ఎవరన్నది లీక్ అయ్యింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం రోహిణి, ముక్కు అవినాష్, యాంకర్ రవి, టేస్టీ తేజ, గంగవ్వ, నయని పావని, మెహబూబ్, హరితేజ, గౌతం కృష్ణ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తున్నారని టాక్. Also Read – హీరో విలనిజం.. అలా సెట్ చేశారు..! సీజన్ 8 ని సూపర్ హిట్ చేసేందుకు ఆల్రెడీ బిగ్ బాస్ ఎక్స్ పీరియన్స్ ఉన్న కంటెస్టెంట్స్ నే మళ్లీ తెస్తున్నారు. సో ఎక్స్ పీరియన్స్ చేసిన ఓల్డ్ కంటెస్టెంట్స్ తో పాటు ప్రెజంట్ హౌస్ లో ఉన్న వారు మధ్య ఫైట్ జరుగుతుంది. ఐతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో టాప్ ప్లేస్ కు వెళ్లే ఛాన్స్ ఎవరెవరికి ఉండొచ్చు అన్నది చూడాలి. వాళ్లకు ఎంత ప్లస్ పాయింట్ ఉందో మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ ని ఇలా పాత వారిని తీసుకోవాలనే ఆలోచనే షోపై స్పెషల్ క్రేజ్ ఏర్పడేలా చేసింది. మరి బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక షో ఎలా టర్న్ అవుతుందో చూడాలి.


0 Comments

Leave a Reply

Avatar placeholder

Your email address will not be published. Required fields are marked *